CWC Meeting: 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

by Mahesh Kanagandla |

ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ సహా ఇతర సభ్యులు పాల్గొననున్నారు.

CWC Meeting: 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ సహా ఇతర సభ్యులు పాల్గొననున్నారు. ఇటీవలే జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాలో ఓటమికి గల కారణాలను సమీక్షించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపైనా సమాలోచనలు చేయనున్నట్టు సమాచారం. ఒక వైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ భేటీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అదానీ అవినీతి కేసు సహా పలు అంశాలపైనా దృష్టి సారించే అవకాశముంది.

Next Story