viral: ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా చెప్పు విసిరిన కాంగ్రెస్ కార్యకర్త!

by Ramesh Naini |

స్థానిక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్త చెప్పు విసిరిన ఘటన కలకలం రేపుతోంది.

viral: ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా చెప్పు విసిరిన కాంగ్రెస్ కార్యకర్త!
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్త చెప్పు విసిరిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ప్రసంగిస్తుండగా, ఒక వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. గుజరాత్ జోడో కార్యక్రమంలో భాగంగా విశావదర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రసంగం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై చెప్పు విసిరాడు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన ఆప్ కార్యకర్తలు చెప్పు విసిరిన దుండగుడిపై ఒక్కసారిగా దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పకముందే పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని నేను క్షమించాను.. దేవుడు ఈ వ్యక్తిని, అతని కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ప్రార్థిస్తున్నట్లు ఆప్ ఎమ్మెల్యే ఇటాలియా మీడియాతో మాట్లాడారు. నేను మాట్లాడుతుండగా, అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు వేదిక వద్దకు వస్తున్నట్లు గమనించాను.. నేను మాట్లాడుతుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా జనసమూహం నుండి లేచి నిలబడి నాపై చెప్పు విసిరి, నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. అతను చెప్పు విసిరిన వెంటనే, పోలీసులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి వచ్చారు.. అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సంఘటనకు బీజేపీ కారణమని ఆయన ఆరోపించారు. బీజేపీ ఇలాంటి చర్యల ద్వారా AAPని ఆపాలని కోరుకుంటుందని తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి ఘటనలకు తాము భయపడేది లేదని, మాపై చెప్పులు విసరడం వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగదని, ప్రజల కోసం పనిచేయండని ఫైర్ అయ్యారు. కాగా, ఎమ్మెల్యేపై చెప్పు విసిరిన వ్యక్తి జామ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఛత్రపాల్‌సిన్హ్ జడేజా అని పోలీసులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. వీడియో ఇదే..

Next Story