అధికారంలోకి వస్తే ఆ పని చేసి తీరుతాం.. ఖర్గే సంచలన ప్రకటన

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై నిషేధం విధిస్తామని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వస్తే ఆ పని చేసి తీరుతాం.. ఖర్గే సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై నిషేధం విధిస్తామని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతుందని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, “మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ను ఖచ్చితంగా నిషేధిస్తాం. గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) కూడా అదే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వారు పైకి చట్టాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వారి అసలైన లక్ష్యాలు వేరే” అని అన్నారు. తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టపరంగా ముందుకెళ్లతామని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు 250 కోట్ల రూపాయల నిధులు ఎలా వచ్చాయన్న విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు అవసరమని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం గంభీరంగా తీసుకోవాలని అన్నారు.

జూన్ 27న ఖర్గే తన 'ఎక్స్‌' ఖాతా ద్వారా చేసిన పోస్టులో ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని ఆరోపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా (Quit India) ఉద్యమం వంటి చారిత్రక ఘటనల్లో ఆ సంస్థ ఎలాంటి పాత్ర పోషించలేదని విమర్శించారు. ప్రారంభ దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగం, జాతీయ పతాకానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సంస్థ బీజేపీ (BJP)కి ఓ కీలుబొమ్మలా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశ రాజకీయం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story