- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ విమర్శలు
బీజేపీతో, ఆర్ఎస్ఎస్ తో, దేశంతోనూ ప్రతిపక్షం పోరాడుతోందన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపైనే కేంద్రమంత్రులు విరుచుకు పడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీతో, ఆర్ఎస్ఎస్ తో, దేశంతోనూ ప్రతిపక్షం పోరాడుతోందన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపైనే కేంద్రమంత్రులు విరుచుకు పడ్డారు. కాంగ్రెస్(Congress party) నిజస్వరూపం ఈ వ్యాఖ్యలతో బయపడిందని బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు. ‘రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్‌తో సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దేశం పరువు తీయాలని, కించపరచాలని, అప్రతిష్ఠపాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. పదే పదే ఆయన చేస్తున్న పనులు ఈ నమ్మకానికి బలం చేకూర్చాయి. భారత్‌ను ముక్కలు చేసి, విభజించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటీ చేశారు.. చెప్పారు’ అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నడ్డా మండిపడ్డారు. రాహుల్ గాంధీ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పరోక్షంగా వ్యాఖ్యానించారు. "అతని మానసిక స్థితిని చెక్ చేసుకోవడానికి వెళ్లమని చెప్పండి" అని చురకలు అంటించారు. దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విపక్ష నేత దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.
రాహుల్ ఏమన్నారంటే?
కాంగ్రెస్ కాషాయపార్టీని, ప్రధాని మోడీని వ్యతిరేకిస్తూనే.. దేశాన్ని కూడా వ్యతిరేకించడం ప్రారంభించారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. వారంతా దేశం, దేశంలోని రాష్ట్రాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని మండిపడ్డారు. ఇవి యాథృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదు.. ఆలోచించి చెప్పినవే అని విమర్శించారు. ఇది సోరోస్ (జార్జ్ సోరోస్) స్పాన్సర్ చేసినట్లుగా ఉందన్నారు. రాహుల్ గాంధీ 'భారత్ తోడో' ఎజెండాను అనుసరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ (Congress) నూతన ప్రధాన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఆర్ఎస్ఎస్ వంటి మా భావజాలం వేల సంవత్సరాల నాటిది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేం ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోపాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నాం’ అని అన్నారు. దీనిపైనే బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.






