Congress: కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీతో కలిసి మైండ్ గేమ్! సీనియర్ ఎంపీపై వేటు దిశగా కాంగ్రెస్?

by Prasad Jukanti |   (  Updated:2025-05-19 05:30:53  IST  )

ఎంపీ శశిథరూర్ అంశం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతోంది.

Congress: కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీతో కలిసి మైండ్ గేమ్!  సీనియర్ ఎంపీపై వేటు దిశగా కాంగ్రెస్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ శశిథరూర్ (MP Sasitharur) అంశం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతోంది. ఆయన వ్యవహారం గత కొంత కాలంగా హస్తం పార్టీలో అయోమయాన్ని క్రియేట్ చేస్తోంది. ఇటీవల భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తల సయమంలోనే వరుస వ్యాఖ్యలతో శశిథరూర్ శశిథరూర్ పార్టీ లక్ష్మణ రేఖ దాటారనే అభిప్రయాలు సొంత పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి (Congress) మింగుడు పడటం లేదని దాంతో ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోందనే చర్చ హాట్ హాట్ గా మారింది. ఇండో పాక్ విషయంతో పాటు పలు అంశాల్లో శశిథరూర్ ప్రధాని మోడీని ఆకాశానికెత్తుతున్నారు. ఇటీవల కేరళ పర్యటనలో శశిథరూర్ వేదికపై ఉండగా ప్రధాని మోడీ ఇండియా కూటమిపై సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయా పార్టీల ఎంపీల బృందాన్ని ప్రకటించగా అందుకో కాంగ్రెస్ పార్టీ సూచించనప్పటికి కేంద్రం శశిథరూర్ ను ఎంపిక చేసింది. ఈ వ్యవహావరం వెనుక కాంగ్రెస్ ను దెబ్బతీసే కోణం ఉందనే అనుమానాలు కాంగ్రెస్ లో వ్యక్తం అవుతున్నాయి.

పార్టీలో ఉంటూనే మైండ్ గేమ్?:

శశిథరూర్ వ్యవహార శైలిని గమనిస్తున్న కాగ్రెస్ అధిష్టానం ఆయనపై తీసుకోబోయే చర్యలపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలోనే కొనసాగుతూ బీజేపీతో (BJP) కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా హస్తం పార్టీ పెద్దలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. 2026లో కేరళ (Kerala) అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేరళలో కీలక నాయకుడిగా ఉన్న శశిథరూర్ అంశాన్ని ఇక ఉపేక్షించవద్దని ఆయన విషయంలో త్వరలో ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో సీనియర్ నేత కావడం, సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనపై వేటు వేద్దామా లేక మరి కొంత కాలం వేచి చూద్దామానే అనే మరో ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ ఎపిసోడ్ కు ఏ రకంగా ఎండ్ కార్డు పడుతుందో అనేది ఉత్కంఠగా మారింది.

Next Story