- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: ఏప్రిల్ 8, 9వ తేదీల్లో అహ్మదాబాద్‌లో ఏఐసీసీ కీలక సమావేశాలు
భవిష్యత్ కార్యచరణపై కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఇక్కడ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భవిష్యత్ కార్యచరణపై కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఇక్కడ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ రెండు సమావేశాలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలను ఒక్క దగ్గరికి చేర్చడమే కాకుండా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై జరుగుతున్న దాడిపై చర్చించి భవిష్యత్ కార్యతరణను రూపొందిస్తామన్నారు. . ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్నారు. గతేడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ఈ సమావేశాలను కొనసాగిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశం కీలకమైన చర్చలకు వేదికగా మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల ఆందోళనలను పరిష్కరించేందుకు, దేశం కోసం బలమైన ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ప్రదర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ సమిష్టి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుందని అన్నారు.






