భువనేశ్వర్ అత్యాచారం కేసు.. కాంగ్రెస్ విద్యార్థి నేత అరెస్ట్

by Naga Rani Yarlagadda |

ఈ ఏడాది మార్చి నెలలో 19 ఏళ్ల విద్యార్థినికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి.. లైంగిక దాడికి పాల్పడిన కేసులో కాంగ్రెస్ పార్టీ ఒడిశా యూనిట్ విద్యార్థి నాయకుడు ఉదిత్ ప్రధాన్ ను భువనేశ్వర్ లోని మంచేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

భువనేశ్వర్ అత్యాచారం కేసు.. కాంగ్రెస్ విద్యార్థి నేత అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది మార్చి నెలలో 19 ఏళ్ల విద్యార్థినికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి.. లైంగిక దాడికి పాల్పడిన కేసులో కాంగ్రెస్ పార్టీ ఒడిశా యూనిట్ విద్యార్థి నాయకుడు ఉదిత్ ప్రధాన్ ను భువనేశ్వర్ లోని మంచేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18న జరిగిన ఈ ఘటనపై బాధితురాలు జులై 20న రాత్రి 8.30 గంటలకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి మాస్టర్ క్యాంటీన్ చౌక్ లో ఉన్న సమయంలో ఉదిత్ ను కలిసింది. తన ఫ్రెండే ఆమెను ఉదిత్ కు పరిచయం చేయగా.. తనను తాను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఒడిశా అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నాడు.

ఆ తర్వాత ఉదిత్ వాహనంలో నయాపల్లిలోని ఒక హోటల్ కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించగా.. బాధితురాలు మాత్రం మద్యం తాగేందుకు నిరాకరించింది. దీంతో ఉదిత్ ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేయడంతో దానిని తీసుకుని తాగింది. అనంతరం ఆమెకు మైకం కమ్మినట్లు అనిపించడంతో ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఉదిత్ తో పాటు అతనితో ఉన్న ఫ్రెండ్స్ ఆమెకు సహాయం చేయకపోగా.. స్పృహ కోల్పోయేంతవరకూ అక్కడే ఉంచారు. ఆమెకు మెలకువ వచ్చాక తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుని ఉదిత్ ను ప్రశ్నించింది. విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో ఆమె విషయం బయటికి చెప్పలేదు. తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆదివారం రాత్రి ఉదిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story