Congress: ఎస్ఐఆర్ ప్రక్రియ మళ్లీ చేపట్టాలి.. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా

by B.Srinivas |

బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు.

Congress: ఎస్ఐఆర్ ప్రక్రియ మళ్లీ చేపట్టాలి.. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pavan khera) డిమాండ్ చేశారు. తమ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు 89 లక్షల అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను గుర్తించారని, కానీ ఎన్నికల సంఘం అన్నింటినీ తిరస్కరించిందని ఆరోపించారు. ఆదివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ లో బయటపడిన అక్రమాలు ఈసీ చర్యలపై సందేహాలు కలిగిస్తున్నాయని కాబట్టి ప్రక్రియను మళ్లీ చేపట్టాలని తెలిపారు. ‘పొలిటికల్ పార్టీల నుంచి ఫిర్యాదులు రావడం లేదని ఈసీ చెబుతోంది. కానీ ఎస్ఆర్‌లో అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పలు ఫిర్యాదులను ఈసీకి అందజేసింది. మా బీఎల్ఏలు ఫిర్యాదులు చేయడానికి వెళ్తే వాటిని స్వీకరించడానికి తిరస్కరించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయి’ అని వ్యాఖ్యానించారు.

బిహార్‌లోని 90,540 బూత్‌ల నుంచి 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని తెలిపారు. 100 కంటే ఎక్కువ పేర్లు తొలగించిన బూత్‌లు 20,368 ఉండగా 200 కంటే ఎక్కువ పేర్లు తొలగించిన బూత్‌ల సంఖ్య 1,988గా ఉందని, అలాగే 70 శాతం కంటే ఎక్కువ మహిళల పేర్లు తొలగించబడిన బూత్‌లు 7,613 ఉన్నాయన్నారు.

Next Story