ముస్లింల దారిద్య్రానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలి.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

by Kema Shiva Kumar |

ముస్లింల దారిద్య్రానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముస్లింల దారిద్య్రానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలి.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింల దారిద్య్రానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హజ్‌ యాత్రపై రివ్యూ మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌పై విపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించారు. భారతదేశంలో మైనారిటీలకు ఇతర దేశాల కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించబడుతాయని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం మైనారిటీలతో కాంగ్రెస్ ఆడుకోవడం సరికాదని కామెంట్ చేశారు. గత 75 ఏళ్లుగా ఇదే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను కేవలం తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుటోందని ఫైర్ అయ్యారు. ఇక ఇప్పటికైనా హస్తం పార్టీ ఆ పని మానేస్తే బాగుంటుందని హితవు పలికారు. మైనారిటీలతో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయకూరినప్పటికీ.. వారికి హానీ తలపెడుతున్నారని ఆరోపించారు. ముస్లింల దారద్ర్యానికి కాంగ్రెస్ పార్టీనే పూర్తి బాధ్యత వహించాలని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.

Next Story