- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ న్యూలుక్‌పై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే
ప్రధాని మోడీ లేటెస్ట్ లుక్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. నేడు కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మోడీ జంగిల్ సఫారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ లేటెస్ట్ లుక్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. నేడు కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మోడీ జంగిల్ సఫారీ చేశారు. దాదాపు 20 నిమిషాలపాటు జీపులో పార్క్ లోపల తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీజేపీ వైరల్ చేస్తోంది. మరోవైపు వాటిని ఎడిట్ చేసి కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. జంగిల్ సఫారీలో ప్రధాని మోడీ దిగిన ఫొటోను కాంగ్రెస్ ఎడిట్ చేసి ట్వీట్ చేసింది. మోడీ నడిచి వస్తున్నట్లుగా ఉన్న ఫోటోకు నీడగా ‘గౌతమ్ అదానీ’ రూపాన్ని కాంగ్రెస్ ఎడిట్ చేసింది. దీనికి ‘వేషం మారింది.. కానీ నీడ ఒక్కటే’ అని హిందీలో క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ప్రధాని టైగర్ రిజర్వ్ పర్యటనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘నేనెవరో కనుక్కోండి.. ప్రచార మంత్రినా, ప్రధాన మంత్రినా?’ అంటూ ట్వీట్ చేశారు. బందీపూర్ ఫైల్స్ మిస్ కాకండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
भेस बदला है, परछाई वही है pic.twitter.com/TVPm38SGTN
— Congress (@INCIndia) April 9, 2023
#BandipurFiles .. today. Don’t miss … ಬಂಡೀಪುರದ ಫೈಲ್ಸ… ನೋಡಲು ಮರೆಯದಿರಿ.. #justasking https://t.co/3SzlOFzCNV
— Prakash Raj (@prakashraaj) April 9, 2023






