ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామా.. వారిపైనే కాంగ్రెస్ అనుమానం!

by Gantepaka Srikanth |

పదవీకాలం మిగిలి ఉండగానే భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామా.. వారిపైనే కాంగ్రెస్ అనుమానం!
X

దిశ, వెబ్‌డెస్క్: పదవీకాలం మిగిలి ఉండగానే భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అనారోగ్య కారణాలవల్లే తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత చరిత్రలో పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వాళ్లలో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మూడోవారు. తాజాగా ఆయన రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెషన్స్ సందర్భంగా ధనఖడ్ అధ్యక్షతన నిన్న సాయంత్రం జరగాల్సిన BAC మీటింగ్‌కు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు రాలేదన్నారు. దానిపై సమాచారం కూడా ఇవ్వకపోవడంతో ధన్‌ఖడ్ అసంతృప్తి చెందినట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సా.4.30 గంటల మధ్యే ఏదో పెద్ద విషయం జరిగిందని, ధన్‌ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలున్నాయని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

మరోవైపు ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే.. 60 రోజుల్లోనే కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సెప్టెబంబర్ 19 లోపు కొత్త ఉప రాష్ట్రపతి రానున్నారు. అప్పటివరకు డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న హరివంశ్‌ తాత్కాలికంగా చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Next Story