ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆందోళనలో అభిమానులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-07 13:15:26  IST  )

కాంగ్రెస్(Congress) అధినేత సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ(Indira Gandhi Medical College)లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆందోళనలో అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) అధినేత సోనియా గాంధీ(Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ(Indira Gandhi Medical College)లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా.. ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించినపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గాంగారమ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జీ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.

Next Story