కాంగ్రెస్ కీలక నిర్ణయం..దేశ వ్యాప్తంగా జైహింద్ ర్యాలీలు

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జైహింద్ పేరిట ర్యాలీలు చేయాలని నిర్ణయించింది. భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం

కాంగ్రెస్ కీలక నిర్ణయం..దేశ వ్యాప్తంగా జైహింద్ ర్యాలీలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జైహింద్ పేరిట ర్యాలీలు చేయాలని నిర్ణయించింది. భారత్ పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ర్యాలీలు చేస్తామని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. సైనిక చర్య, భద్రతా దళాలు దేశానికి చెందినవి అయినప్పటికీ కేంద్రం వాటిని తమ బ్రాండ్‌గా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.

దీనిపై రాహుల్ గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడతారని చెప్పారు. అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని మోడీ రాలేదని జైహింద్ ర్యాలీలలో ఈ అంశంపై కూడా నిలదీస్తామని అన్నారు. పహల్గామ్ ఘటన తరవాత ఖర్గే, రాహుల్ గాంధీ కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతించారని సాయుధ దళాలు, కేంద్ర ప్రభుత్వం వెంటే ఉంటామని ప్రకటించారని గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశం రెండుసార్లు జరిగితే మోడీ ఒక్కసారి కూడా రాలేదని మండిపడ్డారు.

Next Story