ప్రతి ఫోన్‌లో "సంచార్ సాథీ" యాప్‌‌.. వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ అడ్జర్న్‌మెంట్ మోషన్‌

by Malleboina Mahesh |

సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం "సంచార్ సాథీ" యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సంచార్ సతిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వాయిదా తీర్మానం దాఖలు చేశారు.

ప్రతి ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌‌.. వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ అడ్జర్న్‌మెంట్ మోషన్‌
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం "సంచార్ సాథీ" యాప్‌ ("Sanchar Saathi" app)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ను ప్రతి కొత్త మొబైల్ ఫోన్ లో ఇన్ బుల్డ్ గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫోన్ లలో సైతం "సంచార్ సాథీ" యాప్ ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (MP Renuka Chowdhury) పార్లమెంటులో అడ్జర్న్‌మెంట్ మోషన్‌ను దాఖలు చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) జారీ చేసిన ఈ ఆదేశం, మొబైల్ తయారీదారులు, దిగుమతిదారులు 'సంచార్ సాథీ' యాప్‌ను తొలగించలేని విధంగా (Cannot be deleted) ముందే లోడ్ చేయాలని నిర్దేశిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.

ఈ చర్య భారత రాజ్యాంగంలోని అధికరణ ఆర్టికల్ 21 హామీ ఇచ్చే ప్రాథమిక హక్కు అయిన గోప్యతా హక్కుకు (Right to Privacy) విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. "గోప్యతా హక్కు అనేది జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కులో అంతర్గత భాగం. ఈ యాప్‌ను తొలగించకుండా ముందే లోడ్ చేయాలనే కేంద్రం ఆదేశం ఈ ప్రాథమిక హక్కుకు తీవ్ర భంగం కలిగిస్తుంది" అని అన్నారు. తగిన రక్షణ చర్యలు, పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండా, ఈ తప్పనిసరి నిబంధన "ప్రజల ప్రతి కదలిక, సంభాషణ, నిర్ణయాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది," తద్వారా పౌరులందరిపై 'నిరంతర నిఘా' పెడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సభలో తక్షణ చర్చ జరపాలని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అడ్జర్న్‌మెంట్ మోషన్‌లో డిమాండ్ చేశారు.

Next Story