- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసదుద్దీన్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్.. అక్కడేమో అలా.. ఇక్కడేమో ఇలానా?
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఎంపీ, కాంగ్రెస్ నేషనల్ మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్ గ్రహి బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఎంపీ, కాంగ్రెస్ నేషనల్ మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాప్ గ్రహి బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. అసదుద్దీన్ ఓవైసీ జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నాడని అన్నారు.
కానీ ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు అభ్యర్థులను పెడుతున్నాడని మండిపడ్డారు. నీ రెండు కళ్ల సిద్దాంతం ఇక్కడ నడవదు అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసదుద్దీన్ హైదరాబాద్ నుండి హిమాచల్ వరకు పర్యటిస్తారని చెప్పారు. ఆయన మోసాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుండటంతో ప్రతాప్ గ్రహి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.






