Minister Stucked In Lift : లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి.. ఇంకాసేపు అయిఉంటే?

by Muthe.Rajitha |

తమిళనాడు(Tamilanadu)లో కాంగ్రెస్ మంత్రి(Congress MP) ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కుపోవడం కలకలం రేపింది.

Minister Stucked In Lift : లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి.. ఇంకాసేపు అయిఉంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu)లో కాంగ్రెస్ మంత్రి(Congress MP) ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కుపోవడం కలకలం రేపింది. కడలూరు జిల్లాలోని ఓ హోటల్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు ఎంపీ విష్ణు ప్రసాద్(MP Vishnu Prasad) మరో ఆరుగురు నేతలతో కలిసి సదరు హోటల్ లోని లిఫ్ట్ ఎక్కారు. అయితే కొద్ది క్షణాల్లోనే లిఫ్ట్ లో సాంకేతిక సమస్యలతో అది ఆగిపోయింది. కాగా బయట ఉన్న సిబ్బందికి ఫోన్లో లిఫ్టులో ఇరుక్కు(Stucked in Lift) పోయిన విషయం తెలపగా.. హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే వారు అక్కడికి చేరుకుని సమస్యను సవరించేందుకు ప్రయత్నం చేసినా గంటసేపటి వరకు అది తెరుచుకునే వీలు పడలేదు. చివరకి లిఫ్ట్ డోర్ బ్రేక్ చేసి ఎంపీని సురక్షితంగా బయటికి తీసుకు వచ్చారు. మిగిలిన నేతలు కూడా బతుకు జీవుడా అని లిఫ్ట్ నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు నిర్వహణపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story