- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: చైనాను శత్రువులా చూడొద్దు.. మరోసారి సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్(Congress) నేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- చైనా మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నవేళ బీజింగ్ గురించి మాట్లాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్(Congress) నేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- చైనా మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నవేళ బీజింగ్ గురించి మాట్లాడారు. భారతదేశం చైనా (China)ను శత్రువులా చూడొద్దని సామ్ పిట్రోడా అన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని పేర్కొన్నారు. మొదటినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి వల్ల ఇరుదేశాల మధ్య శత్రుత్వం పెరిగిపోతుందని అన్నారు. ‘‘చైనాతో భారత్ ముందు నుంచి ఘర్షణాత్మక వైఖరినే అనుసరిస్తుంది. మనం అవలంబిస్తున్న ఆ విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోంది. భారత్‌కు సరైన మద్దతు దక్కట్లేదు. ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకోవాలి. ఒక్క చైనా విషయంలోనే కాదు.. ఇతరదేశాలకు కూడా ఈ విధానం వర్తిస్తుంది. అయినా చైనా నుంచి ఏం ముప్పుందో నాకు అర్థం కావట్లేదు. అమెరికా చైనాను తరచూ శత్రువుగా పేర్కొంటూ.. భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మరింత వేగంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తోంది. ఇలాంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా ఎక్కువగా ఉంటోంది. ఇక, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువగా ఉంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలోఉంచుకొని మనం ప్రవర్తించాలి’’ అని పిట్రోడా అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు ఒకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇందులోభాగంగా ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్‌ను పెంచుకుంటూ.. అవసరమైన సమయంలో సహకరించుకోవాలని అన్నారు.
సామ్ పిట్రోడాపై బీజేపీ నేతల విమర్శలు
కాగా.. సామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. భారతదేశ గుర్తింపు, దౌత్యం, సార్వభౌమాధికారంపై దెబ్బ అన బీజేపీ పేర్కొంది. ఇది వ్యక్తిగత ప్రకటన కాదని.. రాహుల్ గాంధీ కూడా గతంలో ఇలాంటి కామెంట్లు చేశారని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. గల్వాన్ ఘర్షణలో చనిపోయిన భారత సైనికులను అవమానించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చైనా పట్ల ఉన్న మక్కువ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP)తో కాంగ్రెస్ కు 2008లో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)లో కీలకాంశం ఉందని బీజేపీ నేత తుహిన్ సిన్హా అన్నారు. భారత భూభాగంలో 40 వేల చదరపు కిలోమీటర్లను చైనాకు అప్పగించిన వారికి ఇప్పటికీ డ్రాగన్ నుంచి ఎలాంటి ముప్పు కన్పించట్లేదని చురకలు అంటించారు. మరో బీజేపీనేత ప్రదీప్ భండారి సామ్ పిట్రోడా రాహుల్ గాంధీకి సన్నిహితుడని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ.. భారతదేశం కంటే చైనా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉస్తుందన్నారు. రాహుల్ గాంధీ, రిమోట్ కంట్రోల్ జార్జ్ సోరోస్, చైనా చేతిలోనే ఉందగని ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఇకపోతే, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. భారత్- చైనా ఘర్షణల నివారణకు సాయం చేస్తానంటూ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కాగా భారత్ ఆ ఆఫర్ ని సురక్షితంగా తిరస్కరించింది. ఇలాంటి సమయంలో సామ్ పిట్రోడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






