ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట

by Disha Web Desk 2 |
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో రాహుల్ గాంధీకి భారీ ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్డినరీ పాస్‌పోర్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను కోర్టు పాక్షికంగా అనుమతిస్తూ...మూడు సంవత్సరాల పాటు సాధారణ పాస్‌పోర్ట్ జారీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) మంజూరు చేసింది. దీంతో కొత్త పాస్‌పోర్టు తీసుకునేందుకు రాహుల్‌కు అనుమతి లభించింది. విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘నేను మీ దరఖాస్తును పాక్షికంగా అనుమతిస్తున్నాను. 10 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు’అని రాహుల్ గాంధీ తరపు న్యాయవాదికి తెలిపారు.

కాగా, మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. అలాగే లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడంతో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీని ఫలితంగా దౌత్య పాస్‌‌పోర్ట్ సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సరెండర్ చేశారు. దీంతో ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా..నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ పేరు ఉన్న కారణంగా పాస్‌పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ ఇవ్వాలని ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌కు ఊరటనిచ్చేలా ఆదేశాలు ఇచ్చింది.


Next Story

Most Viewed