- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నష్టనివారణ చర్యల్లో భాగమే ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్షం: జైరాం రమేశ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో ఈ విధంగా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని దుయ్యబట్టారు. 2014 వరకు అఖిలపక్షాన్ని ఐక్యరాజ్యసమితికి పంపించి భారత్ వాణిని వినిపించే సంప్రదాయం ఉండేదని , ఆ సంప్రదాయాన్ని మోదీ ఆపివేశారని జైరాం రమేశ్ విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంచుకున్న బలమైన విధానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో 7 టీమ్స్‌ను ఏర్పాటు చేసి విదేశాలకు పంపాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ రగడ మొదలైంది. ఎవరెవరిని పంపాలన్న విషయంలో ఎంపికలను పార్టీలకే వదిలేసి ఉండాలని కొందరు అనగా.. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.






