- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
28శాతం పేదరికం.. సమానత్వం ఎక్కడ?.. కేంద్రంపై జైరాం రమేశ్ విమర్శలు
by Phanindra |
ప్రపంచంలో అత్యధిక ఆర్థిక సమానత్వం ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. దేశంలో 28 శాతం పేదరికం ఉన్న విషయాన్ని గుర్తుచేసింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో అత్యధిక ఆర్థిక సమానత్వం ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డేటాలో భారత జీనీ ఇండెక్స్ స్కోరు 25.5గా ఉంది. దీంతో ప్రపంచంలో ఆర్థిక సమానత్వంలో భారత్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీన్ని కొట్టిపారేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్.. దేశంలో 28.1 శాతం పేదరికం ఉందని, ఇలా ఉన్న ఏ దేశమూ ప్రపంచంలో సమానత్వం ఉన్న సమాజంగా ప్రచారం చేసుకోదని చురకలేశారు. ప్రపంచ బ్యాంకు డేటాను తమకు అనుకూలంగా కేంద్ర వాడుకుంటోందని విమర్శించారు.
Next Story






