- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AAP: రెస్ట్ ఇన్ పీసెస్.. కాంగ్రెస్‌పై ఆప్ సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్: ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రతిపక్ష పోరు నడుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు అంతకంతకు ముదురుతోంది. విమర్శలు..

X
దిశ, వెబ్‌డెస్క్: ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రతిపక్ష పోరు నడుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు అంతకంతకు ముదురుతోంది. విమర్శలు, ఆరోపణలతో ఇరు పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇదే తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. రెస్ట్ ఇన్ పీసెస్ అంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు కురిపించారు. అయితే గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 8 మంది బీజేపీలో చేరడంపై రాఘవ్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ ఆపరేషన్ లోటస్.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పని చేయలేదు. కానీ గోవాలో మాత్రం అద్భుతంగా పని చేసింది. ఎందుకు? ఎప్పుడైతే మీరు కాంగ్రస్‌కు ఓటు వేస్తారో మీరు భవిష్యత్ బీజేపీ ఎమ్మెల్యేను ఎంచుకున్నట్లే. కాంగ్రెస్ అయిపోయింది. రెస్ట్ ఇన్ పీసెస్' అని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.
Next Story






