- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ విభజనకు కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత.. లోక్‌సభలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. ఇవాళ లోకసభలో ఆయన ‘ఆపరేషన్ సిందూర్’పై మాట్లాడుతూ.. పహల్గాం దాడి కేవలం పర్యాటకుపై కాదని.. తాము దేశంపై దాడిగా పరిగణించామని అన్నారు. దాడి చేసిన వారిని ఇప్పటికే మట్టిలో కలిపేశామని.. 140 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడును మోడీ ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. పాక్‌పై దాడలు చేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వే్చ్ఛను ఇచ్చామని కామెంట్ చేశారు. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి 9న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని వివరించారు. మన భద్రతాబలగాల దాడుల్లో ఒక్క పౌరుడు కూడా మరణించలేదని అమిత్ షా తెలిపారు.
యుద్ధాలతో అనేక తీవ్ర పరిణామాలు వస్తాయని తెలీదా..
వంద కిలో మిటర్లు పాక్ భూ భాగంలోకి వెళ్లి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని అమిత్ షా (Amit Shah) తెలిపారు. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాద నేతలు కూడా హతమయ్యారని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పామని తెలిపారు. పాక్ దాడుల్లో మన గురుద్వారా, మరో దేవాలయం ధ్వంసం అయ్యాయని.. కానీ, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌లోని 8 ఎయిర్ బేస్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మే 10న పాక్ డీజీఎంవో ఫోన్ చేశారని.. యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేశారని సభకు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపేశారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారని.. యుద్ధాల వల్ల అనేక తీవ్ర పరిణామాలు వస్తాయని విపక్ష సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు.
దేశ విభజనకు కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత..
జవహర్‌లాల్ నెహ్రూ నిర్ణయం వల్ల జమ్మూకశ్మీర్‌లో అనేక సమస్యలు వచ్చాయని.. మన భద్రతా బలగాలు పాక్ వైపు ముందుకు వెళ్తుంటే నెహ్రూ అడ్డుకోలేదా అని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ యుద్ధంలో జనరల్ మాణిక్ షా వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవలని అన్నారు. పాకిస్తాన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలు జరిగితే.. తాము కాంగ్రెస్‌లా చూస్తూ కూర్చొలేమని, దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. నాడు నెహ్రూ మన దేశంలోని 80 శాతం జలాలను పాక్ అప్పగించారని, జమ్మూకశ్మీర్ విషయంలో మమ్మల్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. దేశ విభజనకు కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత అని.. పోటీ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఘనత ఆ పార్టీ నేతలదేనని అమిత్ సెటైర్లు వేశారు.






