- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముమ్మర కసరత్తు.. 58 మంది పర్యవేక్షకుల నియామకం
ఈ ఏడాది చివర్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Eletions) కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది చివర్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Eletions) కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతోంది. ఇందుకోసం మొత్తం 58 మంది ఎన్నికల పర్యవేక్షకులను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షకుల జాబితాలో రిటైర్డ్ వింగ్ కమాండర్ అనుమా ఆచార్య, అలీ మెహందీ, అశోక్ చందా, మనోజ్ యాదవ్, నదీమ్ జావేద్, షోయబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ (RJD) 144 చోట్ల పోటీచేసి 75 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో గెలిచింది. మహాఘట్‌బంధన్‌లో భాగమైన సీపీఐ(ఎంఎల్), ఇతర మిత్రపక్షాలు 19 నియోజకవర్గాల్లో బరిలోకి దిగి 12 సీట్లు గెలుచుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల నిర్వహణను శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.






