కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. CWC సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం

by Kema Shiva Kumar |

కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. CWC సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక నూతన సీఎంగా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (DK Shivakumar) అధికారికంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న సీనియర్ నేత సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ సముచిత స్థానం కల్పించింది. ఆయనను పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుడిగా నియమించింది.

ఇక ఢిల్లీ రాజకీయాల్లోకి సిద్ధు..

గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత ఒప్పందాల ప్రకారం.. సిద్ధరామయ్య గౌరవప్రదంగా తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన సీనియారిటీని, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్యను ఏఐసీసీ (AICC) వర్కింగ్ కమిటీలోకి తీసుకుంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story