- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫలితాలతో షాక్‌కి గురయ్యాను: అశోక్ గెహ్లాట్
by Kodari Anjali |
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి కీలక హిందీ రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మిగిలాయి.

X
జైపూర్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి కీలక హిందీ రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మిగిలాయి. రాజస్థాన్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందనే అంచనాల మధ్య వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా వెలువడ్డాయి. 199 సీట్లలో 115 చోట్ల బీజేపీ విజయం దక్కించుకుంది. ఎన్నికల ఫలితాలపై ఆదివారం విలేకరుల సమావేశంలో స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, 'ఈ ఫలితాలు 'ఊహించలేదు ', నిరాశ కలిగించాయన్నారు. అయితే, తాను ప్రజల ఆదేశాలను గౌరవగిస్తానని, కాంగ్రెస్ తన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని అంగీకరిస్తున్నానని' వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలు బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించినప్పటికీ అలా జరగలేదన్నారు.
Next Story






