- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: అప్పటి వరకు కొత్త సీఈసీ ఎంపికను వాయిదా వేయాలి.. కాంగ్రెస్ డిమాండ్
సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఈసీని నియమించడానికి సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ (Rajeev kumar) పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఈసీని నియమించడానికి ప్రధాని మోడీ (Pm modi) అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే సీఈసీ, ఈసీల ఎంపికపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున తదుపరి సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా, ప్రభుత్వం ఎన్నికల సంఘంపై నియంత్రణను కోరుకుంటున్నట్లు స్పష్టం చేసిందని, దాని విశ్వసనీయతను కాపాడుకోవడానికి కాదని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి తెలిపారు.
అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ (Ajay maken) మాట్లాడుతూ.. ‘సీఈసీ ఎన్నికకు సంబంధించిన సమావేశం జరిగింది. ఫిబ్రవరి 19న ఈ విషయంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కమిటీ నియమ నిబంధనలు ఎలా ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సీఈసీ ఎంపికను వాయిదా వేయాలి’ అని తెలిపారు. కాగా, ఈసీ, సీఈసీలకు సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. మరోవైపు, ఎంపిక కమిటీ సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ తర్వాత అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gnanesh kumar) పేరును సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.






