కేరళంలో కాంగ్రెస్ దే అధికారం: లోక్ పోల్ సర్వే

by Prasad Jukanti |   (  Updated:2026-04-03 13:32:03  IST  )

కేరళలో ఈసారి అధికార మార్పు ఖాయం అని తాజా సర్వేలో వెల్లడైంది.

కేరళంలో కాంగ్రెస్ దే అధికారం: లోక్ పోల్ సర్వే
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళం (Keralam) శాసనసభకు పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈసారి అధికార ఎల్‍డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‍డీఏ సైతం 'దేవభూమి'లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువరించిన లోక్ పోల్ సర్వే ఫలితాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈసారి కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని లోక్ పోల్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 42-44 శాతం ఓట్లతో 77-81 స్థానాలు కైవసం చేసుకోబోతోందని, ఇక అధికార ఎల్‍డీఎఫ్ 39-41 శాతం ఓట్లతో 58-62 సీట్లు దక్కించుకోబోతోందని లెక్క కట్టింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్‍డీఏ కూటమి 14-16 శాతం ఓట్లతో కేవలం 1-2 స్థానాలకే పరిమితం కాబోతున్నట్లు అంచనా వేసింది. మార్చి 16 వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య జరిపిన సర్వే శాంపిల్స్ ఆధారంగా ఈ అంచనా వేసినట్లు లోక్ పోల్ శుక్రవారం వెల్లడించింది. కాగా ఈ నెల 9వ తేదీన కేరళంతో పాటు అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న కౌంటింగ్ జరగనుంది.

పేదల ఇళ్లు కూల్చే మీ నుంచి మేము నేర్చుకోవాలా?: రేవంత్‌కు కేరళం సీఎం స్ట్రాంగ్ కౌంటర్

Next Story