ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన ట్వీట్

by Ramesh Goud |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) పోలింగ్ (polling) మొదలైన వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress national president Mallikarjun Kharge) సంచలన ట్వీట్ చేశారు.

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) పోలింగ్ (polling) మొదలైన వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress national president Mallikarjun Kharge) సంచలన ట్వీట్ చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందుకు తలెత్తకుండా ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC leader Rahul Gandhi), కేంద్రమంత్రి జైశంకర్ (Union Minister Jaishankar) సహా పలువురు ప్రముఖులు ఓటు (vote) హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆయన ట్వీట్ లో.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఢిల్లీ ప్రజలు (Delhi people) తమ విలువైన ఓటు వేయవలసిందిగా (cast their valuable vote) విజ్ఞప్తి (appealed) చేశారు. మీ ఒక్క ఓటు (single vote) ఢిల్లీలో మార్పుకు ప్రతీకగా (symbolize change) నిలుస్తుందని, ఢిల్లీ మునుపటిలా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే (move forward), ఢిల్లీ కోసం నిజంగా పనిచేసిన (really worked for Delhi) వారిని ఎన్నుకోవాలని, వారు ఎప్పుడు తప్పుడు వాగ్దానాలు చేసి మిమ్మల్ని మోసం చేయలేదని (never cheated) గుర్తుంచుకోవాలన్నారు.

అలాగే కేవలం సాకులు చెబుతూ చెడిపోయిన రోడ్లు, మురికి నీరు, ఎక్కడ చూసినా చెత్తా చెదారం, కలుషిత గాలి అంటూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వారు మీ గురించి ఎంతగా పట్టించుకుంటారో ఈవీఎం బటన్ (EVM button) నొక్కే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. అంతేగాక కేవలం బూటకపు కుస్తీలు చేసి అధికారంలో ఉండాలనుకునే వారు మీ ఓటుకు హక్కుదారులు కారని చెప్పారు. ఇక ఢిల్లీ సోదరభావం, సామరస్యం, దాని శ్రేయస్సు కొరకు అన్ని రంగాలతో కూడిన అభివృద్ధి (all-round development) చాలా ముఖ్యమైనవి అని, ఢిల్లీని ప్రగతి పథంలో నడిపించే వారినే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్య పండుగను స్వాగతించాలని, తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని మన యువతకు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసిన వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని కాంగ్రెస్ చీఫ్ రాసుకొచ్చారు.

Next Story