కాల్పుల విరమణపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

భారత్ -పాక్ దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement)పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Congress National President Mallikarjuna Karge) స్పందించారు.

కాల్పుల విరమణపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement)పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Congress National President Mallikarjuna Karge) స్పందించారు. గత కొద్ది రోజులుగా ఇండియా -పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు నిలిపివేసేందుకు రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. పాకిస్థాన్ డీజీఎంఓ (PAK DGMO) పిలుపు మేరకు శనివారం కాల్పుల విరమణ, సైనిక చర్యల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం భారత్ -పాక్ దేశాల మధ్య ఉన్న పరిస్థితిపై, పాక్ తో చర్చల నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై చర్చించడానికి పార్లమెంటు సమావేశాన్ని (Parliament Meeting) నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అలాగే యుద్ధం నిలిపివేయబడిందని, ఇది మంచి పరిణామం అని చెప్పారు. అలాగే ప్రజలతో పాటు తాము కూడా శాంతి (Peace)ని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇక దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి మా తరుఫున సంపూర్ణ మద్దతు (Full Support) ఇస్తామని ఖర్గే వెల్లడించారు.

Next Story