బలహీన భారత ప్రధాని.. అందుకే హెచ్1బీ ఫీజు పెంపు: కాంగ్రెస్

by Phanindra |

హెచ్1బీ ఫీజు పెంపుపై మోడీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దేశ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించిన రాహుల్, ఖర్గే.. మోడీని బలహీన ప్రధాని అంటూ విమర్శించారు.

బలహీన భారత ప్రధాని.. అందుకే హెచ్1బీ ఫీజు పెంపు: కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్1బీ వీసాలపై ఫీజును లక్ష డాలర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస నేత రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. మోడీ ఒక బలహీనమైన నేత అని, అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మోడీనే టార్గెట్ చేశారు. విదేశీ విధానాన్ని కౌగిలింతలు, స్లోగన్లు, కెమెరా క్లిక్‌లకే పరిమితం చేశారని మోడీని ఖర్గే విమర్శించారు. యూఎస్‌లో హెచ్1బీ వీసాలు పొందే వారిలో 71 శాతం భారతీయులే ఉన్నారనే కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ‘భారత్‌కు బలహీనమైన ప్రధాని ఉన్నారు’ అని పోస్టు చేశారు.

ఇటీవల మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని ఖర్గే గుర్తుచేశారు. ‘మీ బర్త్ డే కాల్ తర్వాత లభిస్తున్న రిటర్న్ గిఫ్ట్‌లతో భారతీయులు బాధపడుతున్నారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ గవర్నమెంట్ నుంచి ఈ బహుమతులు వస్తున్నాయి’ అంటూ ఖర్గే విమర్శల వర్షం కురిపించారు. అమెరికా తాజాగా తెచ్చిన హైర్ చట్టం వల్ల కూడా భారతీయులనే టార్గెట్ చేస్తోందని, చాబహర్ పోర్ట్ ప్రాజెక్టుపై ఆంక్షలు వేయడాన్ని కూడా ఎత్తిచూపిన ఖర్గే.. యూఎస్ సుంకాలతో ఇప్పటికే భారత్‌కు రూ.2.17 లక్షల కోట్లు నష్టం వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు.

Next Story