- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ కి బదులు ఆపరేషన్ బ్లూస్టార్
ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆపరేషన్ సిందూర్‌ను 'ఆపరేషన్ బ్లూ స్టార్' అని తప్పుగా పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆపరేషన్ సిందూర్‌ను 'ఆపరేషన్ బ్లూ స్టార్' అని తప్పుగా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అల్కా లాంబా మాట్లాడిన తర్వాత వివాదం చెలరేగింది. ఆమె మాట్లాడుతూ.. “కేంద్రంలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం సైనిక చర్యను రాజకీయం చేస్తున్నాయి. సాయుధ దళాల త్యాగాన్ని, పహెల్గామ్ బాధితులను అవమానించిన వారి నాయకులపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. అయితే, ఆపరేషన్ సిందూర్ ని ఆపరేషన్ బ్లూ స్టార్ అని ఆమె తప్పుగా అన్నారు. అయితే, అల్కా లాంబ తన తప్పుని గమనించి వెంటనే.. తనని తాను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. మోడీ ప్రభుత్వం నిజమైన సమస్యలను పక్కదారి పట్టించేందుకు కొత్త సమస్యలు లేవనెత్తుతున్నట్లు ఆరోపించారు. "బీజేపీ నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించాలనుకుంటోంది. నిజమైన ప్రశ్నలకు సమాధానాలు ప్రజలకు తెలుసు. కల్నల్ సోఫియా ఖురేషి వంటి ధైర్యవంతుడైన సైనిక అధికారిణిపై ప్రకటనలు చేసిన నాయకుల తరపున బీజేపీ క్షమాపణ చెబుతుందా? అమరవీరుల కుటుంబాల నుండి మహిళలను అవమానించే వారిని పార్టీ నుండి ఎప్పుడు బహిష్కరిస్తారు? ఈ నాయకులను జైలుకు పంపుతారా?" ఆమె ఎక్స్ లో పోస్టు చేశారు.
బీజేపీ స్పందన..
మరోవైపు, అల్కా లాంబా వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది పొరపాటు కాదు.. వారి మనస్తత్వమే అంతా అని మండిపడింది. దీనిపై, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. “ఇది అజ్ఞానం కాదు. దుశ్చర్య. ఉద్దేశపూర్వకంగా సాయుధ దళాలను బలహీనపరిచి వారి మనోధైర్యాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం' అని అన్నారు. అంతేకాకుండా చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సహా కాంగ్రెస్ నాయకులు సర్జికల్ దాడుల గురించి ప్రశ్నించిన గత సందర్భాలను కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సహా కాంగ్రెస్ నాయకులు భద్రతా దళాలను కించపరిచే, అణగదొక్కే లక్ష్యంతో ఉన్నారని ఆయన అన్నారు. "సేన కా అప్మాన్ కాంగ్రెస్ కి పెహచాన్ (సాయుధ దళాలను అవమానించడం కాంగ్రెస్ గుర్తింపు)" అని కాంగ్రెస్ కి చురకలు అంటించారు.






