కాంగ్రెస్ మునిగిపోతున్న నావ.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

by Vinod kumar |

కాంగ్రెస్ మునిగిపోతున్న నావ.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
X

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలకు దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని అన్నారు. కొందరు వ్యక్తులు ఆ పడవలో ఎక్కి తీరం చేరాలని చూస్తున్నారని.. అది జరగదని విమర్శించారు. మంగళవారం పార్టీ అభ్యర్థి గోవింద్ కర్జోల్ కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న స్పందన అద్బుతమని అన్నారు.

లింగాయత్ ఓటర్ల అవసరమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లింగాయత్ లను, వీరశైవులను కాంగ్రెస్ వీడదీయాలని చూసిందని ఆరోపించారు. ఎన్నికలు సమీపించడంతో వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. కాంగ్రెస్ విభజించు పాలించే విధానాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని తెలిపారు.

Next Story