- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదే పదే అక్కడ టచ్ చేస్తూ.. నిద్రిస్తున్న యువతిపై RTC కండక్టర్ లైంగిక వేధింపులు.. అరెస్ట్
కర్ణాటకలోని మంగళూరులో కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని మంగళూరులో కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఏప్రిల్ 22న చోటు చేసుకుంది. వీడియోలో చూపించిన ప్రకారం.. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు పక్క పక్క సీట్లలో కూర్చున్నారు. అందులో ఓ యువతి నిద్రపోతుండగా ఆమె పక్కనే వచ్చి నిలబడిన కండక్టర్, ఆమెను పదేపదే టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. మిగతా ప్రయాణికులకు అనుమానం రాకుండా అతను యువతిని టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో ఘటన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన రవాణా మంత్రి రామలింగారెడ్డి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. కండక్టర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కండక్టర్ 35 ఏళ్ల ప్రదీప్ నాయకర్‌గా గుర్తించారు. కోనాజే పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు. మరోవైపు కేఎస్‌ఆర్‌టీసీ వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఇక సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో కండక్టర్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు.






