New Year Party : న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్‌లో కండోమ్స్.. షాకింగ్ ఘటన ఎక్కడంటే..?

by Sathputhe Rajesh |

న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్‌తో పాటు ఓ పబ్ కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

New Year Party : న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్‌లో కండోమ్స్.. షాకింగ్ ఘటన ఎక్కడంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : న్యూ ఇయర్ పార్టీ ఇన్విటేషన్‌తో పాటు ఓ పబ్ కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర పూణేలో సోమవారం చోటు చేసుకుంది. దీనిపై మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇన్విటేషన్ స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పబ్ మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ పూణే పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్‌ను కోరింది. యూత్ కాంగ్రెస్ నేత అక్షయ్ మాట్లాడుతూ..‘పబ్, నైట్ లైఫ్‌కు మేము వ్యతిరేకం కాదు. యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి చెత్త మార్కెటింగ్ స్ట్రాటజీలు సరికాదు. పోలీసులు పబ్‌పై వెంటనే చర్యలు చేపట్టాలి.’ అన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపాడు. ఇన్విటేషన్ అందుకున్న పలువురిని విచారించినట్లు ఆయన పేర్కొన్నాడు.

Next Story