సమోసాల్లో కండోమ్స్, గుట్కాలు.. ఓ క్యాంటీన్‌లో ఘటన.. ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 14 |
సమోసాల్లో కండోమ్స్, గుట్కాలు.. ఓ క్యాంటీన్‌లో ఘటన.. ఎక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినే స్నాక్స్ సమోసా. అలాంటి సమోసాల్లో ఏవేవో వస్తువులు కలిపి కొందరు దుండగులు తయారు చేసి అందరిని షాక్‌కు గురి చేశారు. అందులో కండోమ్స్, గుట్కాలు, రాళ్లు వేసి సమోసాలు తయారు చేశారు. ఇవి తిన్న వారు ఒక్క సారిగా ఇవి రావడం చూసి అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ క్యాంటీన్‌లో చోటు చేసుకుంది. క్యాంటీన్ కాంట్రాక్ట్ కాన్సెల్ చేశారని కోపంతో సమోసాల్లో గుట్కాలు, కండోమ్స్, రాళ్లు వేసి తయారు చేసి నీచానికి పాల్పడ్డారు.

పుణేలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ ఓ వ్యక్తి క్యాంటీన్ క్యాటరింగ్ కాంట్రాక్టును తొలగించి కొత్త వారికి సప్లై కాంట్రాక్ట్ ఇచ్చారు. దీంతో పాత కాంట్రక్టర్ పగ పెంచుకోని కొత్త క్యాటరింగ్ సంస్థలో తన మనుషులను పెట్టించి కంపెనీకి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సమోసాల్లో గుట్కాలు, కండమ్స్, రాళ్లు పెట్టి తయారు చేశారు. దీంతో ఆటో మొబైల్ కంపెనీ యాజమాన్యం కేసు పెట్టగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ నీచానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed