- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం మంట గలిసింది.. క్యాన్సర్ బాధితుడి పట్ల అమానుషం
మానవత్వం మంట గలిసిన ఘటన ఒకటి మహారాష్ట్రలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : మానవత్వం మంట గలిసిన ఘటన ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఎవరికైనా క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యం వస్తే.. వారికి అండగా నిలబడి ధైర్యం చెబుతాం. ఏదైనా సహాయం కావాల్సి వస్తే కూడా అందిస్తాము. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీ మాత్రం క్యాన్సర్ తో బాధ పడుతున్న తన ఉద్యోగికి సహాయం అందించక పోగా ఉన్న ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా తొలగించి, ఇంటికి పంపింది. పుణెలోని ఓ కార్పొరేట్ సంస్థ తన దగ్గర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి క్యాన్సర్ తో పోరాడుతున్నాడు అని తెలిసి కూడా విధుల నుంచి చెప్పా పెట్టకుండా తొలగించడం చర్చకు దారి తీసింది.
కంపెనీ చర్యపై ఆగ్రహం చెందిన ఆ ఉద్యోగి.. " నాకు జీతం కాదు, జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి.." అంటూ అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సదరు కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కాగా తమ ఉద్యోగిని కష్ట కాలంలో ఆదుకోవాల్సింది పోయి.. ఇలా కాస్తో కూస్తో ఆర్థిక సమస్యల నుంచి బయట పడేసే ఉద్యోగం నుంచి తొలగించడం అమానుషం అంటూ కంపెనీ తీరుపై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి.






