- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సులో కలకలం.. కండక్టర్ టికెట్ బ్యాగ్ మాయం.. మహిళపై అనుమానాలు!
బెంగళూరు నగరంలోని ఓ బీఎంటీసీ బస్సులో కండక్టర్‌కు చెందిన టికెట్ బ్యాగ్ మాయం అవ్వడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు నగరంలోని ఓ బీఎంటీసీ (Bengaluru Metropolitan Transport Corporation) బస్సులో (KA-57 F 6331) కండక్టర్‌కు చెందిన టికెట్ బ్యాగ్ మాయం అవ్వడం తీవ్ర కలకలం రేపింది. బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కండక్టర్, వెంటనే బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. బ్యాగ్ దొరక్కపోతే తాను సస్పెన్షన్‌కు గురవుతానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మాయమైన టికెట్ బ్యాగ్ తిరిగి లభ్యమైంది.
బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఈ బ్యాగ్‌ను తీసుకున్నట్లు తోటి ప్రయాణికులు పోలీసులకు వివరించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో కండక్టర్ సదరు మహిళను తన ఫోన్‌లో వీడియో కూడా తీశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రయాణికుల వాంగ్మూలాలు, కండక్టర్ తీసిన వీడియో ఫుటేజీని పరిశీలిస్తూ అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.






