Shivraj Singh Chauhan: ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ గా ఇండియా లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం: శివరాజ్ సింగ్ చౌహన్

by Prasad Jukanti |

ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ గా ఇండియా లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని శివరాజ్ సింగ్ చౌహన్ చెప్పారు.

Shivraj Singh Chauhan: ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ గా ఇండియా లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం: శివరాజ్ సింగ్ చౌహన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశాన్ని ఒక రోజున ప్రపంచ దేశాలకు ఫుడ్ బాస్కెట్ గా (Food Basket of the World) మార్చాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chauhan) అన్నారు. మన దేశంలో ఆహార ధాన్యల ఉత్పిత్తి క్రమంగా పెరుగుతోందని మన దేశ అవసరాలను తీర్చడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మేము ఇక్కడితో ఆగిపోవాలని అనుకోవడం లేదని.. భారతదేశం 'విశ్వబంధు' అని అందువల్ల మన దేశ అవసరాలను తీర్చుతూనే ప్రపంచ దేశాలకు సహాయం చేయాలని చూస్తున్నామన్నారు. ఇవాళ విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ పై ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

2023-24లో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి సుమారుగా 15,57.68 లక్షల టన్నులు ఉంటే అది 2024-25లో 16,63.91 లక్షల టన్నులకు పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నానన్నారు. రబీ ఉత్పత్తి 2023-24లో 1600.06 లక్షల టన్నులు ఉంటే అది ఇప్పుడు 1,645.27 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.

Next Story