డెడ్‌‌లైన్స్ కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం..యూఎస్ ట్రేడ్ డీల్‌పై పీయూష్ గోయల్!

by Phanindra |

యూఎస్ ట్రేడ్ డీల్‌పై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెడ్‌‌లైన్స్ కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టంచేశారు.

డెడ్‌‌లైన్స్ కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం..యూఎస్ ట్రేడ్ డీల్‌పై పీయూష్ గోయల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌తో ట్రేడ్ డీల్‌కు డెడ్‌లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందాల్లో భారత్ ఎప్పుడూ పైచేయి సాధించడానికి చూస్తుందని, అంతేకానీ డెడ్‌లైన్స్ కోసం ఒప్పందాలు చేసుకోదని ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై మండిపడ్డ ఆయన.. యూపీఏ హయాంలో దేశానికి ఉపయోగం లేని ఒప్పందాలు చేసుకునేవారని విమర్శించారు. అంతుకుముందే దేశానికి ఉపయోగపడే విధంగా ఒప్పందం కుదిరితేనే దాన్ని భారత్ ఒప్పుకుంటుందని ఆయన స్పష్టంచేశారు. ‘డెడ్‌లైన్స్‌ కింద భారత్ డీల్స్ చేసుకోదు. దేశ ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని చర్చలు సాగిస్తాం. ప్రపంచంలో మేం ఎక్కడ, ఎవరితో చర్చలు జరిపినా దేశోపయోగాలే మాకు ముఖ్యం’ అని గోయల్ తెలిపారు.

అలాగే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారిషియస్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ)తో ఫ్రీ-ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్న విషయాన్ని వాణిజ్య మంత్రి గుర్తుచేశారు. ఇటీవలే యూకేతో కూడా ఒప్పందం చేసుకున్నామన్నారు. ‘భారత్ శక్తిమంతమైన దేశంగా ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలమనే నమ్మకం మాకుంది. ఇది కాంగ్రెస్, యూపీఏ హయాంలో ఉన్న బలహీనమైన దేశం కాదు. ఆ టైంలో దేశానికి ఏమాత్రం ఉపయోగపడని ఒప్పందాలను ప్రభుత్వం చేసుకుంది’ అని గోయల్ విమర్శించారు.

Next Story