బీసీసీఐలో వర్ణ వివక్ష!.. కామెంటరీకి గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ క్రికెట్!

by Prasad Jukanti |   (  Updated:2026-03-20 12:42:37  IST  )

వర్ణ వివక్ష ఆధారంగా తనకు అవకాశాలు రావడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ చేసిన ఆరోపణలు బీసీసీఐ విషయంలో కలకలం రేపుతున్నాయి.

బీసీసీఐలో వర్ణ వివక్ష!.. కామెంటరీకి గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ  క్రికెట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత క్రికెట్ నియంత్రణ మండలిలో (BCCI) వర్ణ వివక్ష కలకలం రేపుతోంది. తాజాగా బీసీసీఐపై టీమిండియా మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. తాను క్రికెట్ వ్యాఖ్యానానికి (Commentary) స్వస్తి పలకడానికి బీసీసీఐ తన పట్ల వర్ణ వివక్ష చూపిందని భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ (Laxman Sivaramakrishnan) సంచలన ఆరోపణలు ఆరోపించారు. భారత్ తరపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడి.. 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషింషించిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత సుమారు రెండు దశాబ్దాల పాటు తన కామెంటరీతో అభిమానులను అలరించారు. అయితేచాలా కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటరీ ప్యానెల్‌లో ఆయన కనిపించడం లేదు.

స్వదేశంలో గౌరవం దక్కలేదు:

ఇదే విషయాన్ని తాజాగా ఒక నెటిజన్ అడుగగా అందుకు శివరామకృష్ణన్ స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కామెంటరీ చేయడం మానేశాను. దానికి కారణం వివక్ష అని స్పష్టం చేశారు. నా రంగును బట్టి నన్ను పక్కన పెట్టారు. 20 ఏళ్ల పాటు నేను ప్రపంచవ్యాప్తంగా కామెంటరీ చేశాను. కానీ నా స్వదేశంలోనే నాకు గౌరవం దక్కలేదని ఆరోపించారు. అంతే కాదు భారతదేశంలో కామెంటేటర్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేదని కేవలం రంగు లేదా ఇతర అంశాల ఆధారంగానే అవకాశాలు ఇస్తున్నారని ఆరోపించారు. తాను ఎంతో అనుభవం ఉన్న సీనియర్ కామెంటేటర్ అయినప్పటికీ గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐ తనను కావాలనే విస్మరించిందని ఆయన వాపోయారు.

నెటిజన్ల రియాక్ట్:

శివరామకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కొందరు కామెంట్స్ చేస్తుంటే వ్యతిరేకంగా మరికొందరు స్పందిస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నవారిలో కొందరు కామెంట్స్ చేసతూ దక్షిణ భారత ఆటగాళ్ల పట్ల, ముదురు రంగు ఉన్న వారి పట్ల వివక్ష చూపడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది స్పందిస్తూ.. శివరామకృష్ణన్ గతంలో సునీల్ గవాస్కర్ వంటి సీనియర్లపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూన్నారు. రంగు వల్ల కాదు ఆయన ప్రవర్తన వల్లే ఆయనకు అవకాశాలు దూరమయ్యాయని అభిప్రాయపడుతున్నారు.

Next Story