Colombo: కొలంబో ఎయిర్ పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్.. కారణమిదే?

by B.Srinivas |

పహెల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు భావిస్తున్న ఆరుగురు అనుమానితులు చెన్నయ్ నుంచి శ్రీలంకకు చేరుకున్నారని సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

Colombo: కొలంబో ఎయిర్ పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంకలోని కొలంబో ఎయిర్ పోర్టు (Air Port)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లోని పహెల్గాం ఉగ్రదాడి (Pahelgam Trror attack) లో పాల్గొన్నట్టు భావిస్తున్న ఆరుగురు అనుమానితులు చెన్నయ్ నుంచి విమానంలో శ్రీలంకకు చేరుకున్నారని భారత్ నుంచి వచ్చిన సమాచారం మేరకు అక్కడి అధికారులు కొలంబో విమానాశ్రయంలో శనివారం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. తమిళనాడులోని చెన్నయ్ నుంచి కొలంలోలోని బండరునాయకే (Bandaru nayake) అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 11:59 గంటలకు యూఎల్122 అనే విమానం చేరుకుంది. ఆ విమానంలో పహెల్గాం దాడి నిందితులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ అందడంతో తనిఖీలు చేపట్టారు. శ్రీలంక పోలీసులు, వైమానిక దళం, విమానాశ్రయ భద్రతా విభాగాలు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించాయి. కానీ అనుమానితులు ఎవరూ కనిపించలేదు.

చెన్నయ్ ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి హెచ్చరిక అందిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. కొలంబోకు చేరుకున్న తర్వాత, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, తదుపరి కార్యకలాపాలకు అనుమతిచ్చామని వెల్లడించింది. శ్రీలంక ఎయిర్ లైన్స్ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపింది. తనిఖీల నేపథ్యంలో ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, గత నెల 22న పహెల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story