- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కాల్చి చంపిన డెలివరీ బాయ్
కొలంబియాలోని కుకుటా నగరంలో లా రివియేరా ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి.. 22 ఏళ్ల మరియా జోస్ ఎస్తుపినాన్ సాంచెజ్ పై కాల్పులు జరిపాడు.

దిశ, వెబ్‌డెస్క్: 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను ఆమె ఇంటి బయటే కాల్చి చంపిన ఘటన కొలంబియాలోని కుకుటా నగరంలో లా రివియేరా ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో జరిగింది. డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి.. 22 ఏళ్ల మరియా జోస్ ఎస్తుపినాన్ సాంచెజ్ పై కాల్పులు జరిపాడు. వెంటనే ఆమె రక్షించాలని కేకలు వేయగా.. అప్పటికే తీవ్రగాయాలపాలైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. అవి వైరల్ అవుతున్నాయి. డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
కాగా.. సాంచెజ్ హత్యకు ఒకరోజు ముందు తన మాజీప్రియుడిపై పెట్టిన హౌస్ హరాస్మెంట్ కేసులో విజయం సాధించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కేసులో ఆమె 30 మిలియన్ కొలంబియన్ పెసోలు అంటే.. సుమారు 7 వేల డాలర్లు పరిహారంగా పొందింది. సో.. ఈ హత్య వెనుక ఆమె మాజీ ప్రియుడి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన నిందితుడి కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు.






