- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన పాత భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు
by Yella Dhawani Reddy |
మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలోని (Mumbai) ఈస్ట్ బాంద్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలోని (Mumbai) ఈస్ట్ బాంద్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత్‌నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున మూడు అంతస్తుల పాత చావ్ భవనం కూలిపోయింది. భవనంలో గ్యాస్ సిలిండర్ పేలి, భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్, ముంబై పోలీసులు చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి రక్షించి, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు గాలింపు కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Next Story






