గూస్ బంప్స్ తెప్పించేలా బొద్దింకల జనతా పార్టీ గీతం.. నెట్టింట వైరల్

by Ajay Maddhiboyina |

గత నాలుగురోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి... ఖాళీగా ఉంటూ సోషల్ మీడియా వాడే యువతను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఈ పార్టీ పురుడు పోసుకుంది.

గూస్ బంప్స్ తెప్పించేలా బొద్దింకల జనతా పార్టీ గీతం.. నెట్టింట వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: గత నాలుగురోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి... ఖాళీగా ఉంటూ సోషల్ మీడియా వాడే యువతను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఈ పార్టీ పురుడు పోసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రారంభించిన సోషల్ మీడియా పేజీ వారం రోజులు కూడా అవ్వకముందే పదిమిలియన్ల ఫాలోవర్స్‌ను సైతం సంపాదించింది. అంతేకాకుండా యమునానదిని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టి ఆ పార్టీలోని యువత మరో మెట్టు ఎక్కేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వడంతో కాక్రోచ్ పార్టీకి మరింత మద్దతు లభిస్తోంది. ఇక ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన గీతం కూడా వచ్చేసింది.

"కాక్రోచెస్..ఎస్ వీ ఆర్ కాక్రోచెస్.." అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు, ఫోటోలతో ఈ పాటను రూపొందించారు. ఈ పాట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. అంతే కాకుండా లిరిక్స్ లో న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడంతో పాటు, యువతకు జరుగుతున్న అన్యాయం, నిరుద్యోగం లాంటి సమస్యలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ వైపు ఇన్ స్టా పేజీకి పెరుగుతున్న ఫాలోవర్ల సంఖ్య, మరోవైపు పార్టీ పాట కూడా ఇప్పుడు వైరల్ అవ్వడంతో భారత్ లోనూ జెన్ జీ ఉద్యమం మొదలవ్వబోతుంది అనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే కాక్రోచ్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Next Story