ఢిల్లీ హైకోర్టు‌కు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ స్థాపకుడు.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-29 08:20:50  IST  )

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ స్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఢిల్లీ హైకోర్టు‌కు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ స్థాపకుడు.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
X

దిశ, వెబ్‌వెస్క్: సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్‌లలో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) స్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వెంటనే ఖాతాను పునరుద్ధరించడానికి హైకోర్టు నిరాకరించింది.

స్పెషల్ రివ్యూటీ కమిటీకి వెళ్లండి..

అయితే, ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి పిటిషనర్‌కు అభిజిత్ దీప్కేకు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక (IT) చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తుచేసింది. నేరుగా కోర్టు ద్వారా కాకుండా, ఐటీ చట్టం పరిధిలోని ఆ రివ్యూ కమిటీ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని అభిజిత్ దీప్కేకు దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, వినూత్న పార్టీ పేరు, అలాగే సోషల్ మీడియా బ్లాకింగ్ అంశం కావడంతో ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం జులై 7కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. హైకోర్టులపై ఆర్టికల్ 142 ప్రయోగం

Next Story