Coaches: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ ప్రెస్.. ఒకరు మృతి

by B.Srinivas |

ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి అసోంలోని కామాఖ్యకు వెళ్తున్న ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.

Coaches: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ ప్రెస్.. ఒకరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి అసోంలోని కామాఖ్యకు వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Super fast express) పట్టాలు తప్పింది. రైలులోని11 ఏసీ బోగీలు పట్టాలు తప్పగా ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కటక్‌ జిల్లా నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. ఘటన అనంతరం ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చడానికి కొత్త రైళ్లను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. పలు రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించారు. హౌరా-చెన్నయ్ మార్గంలో అత్యంత ముఖ్యమైన రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని, దీనివల్ల రైల్వే సేవలు ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రమాద స్థలాన్ని వీలైనంత త్వరగా క్లియర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి (Mohan charan maghi) స్పందించారు. అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిస్థితిని గమనిస్తున్నట్టు చెప్పారు. అలాగే అసోం సీఎం హిమంత బిస్వశర్మ (Himantha biswa sharma) స్పందిస్తూ ఈ ప్రమాదంలో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఒడిశా ప్రభుత్వం, రైల్వే యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

Next Story