- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Co-operative: దేశంలోనే తొలి కోఆపరేటివ్ యూనివర్సిటీ.. శంకుస్థాపన చేసిన అమిత్ షా
దేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ ఈ రంగంలో బంధుప్రీతికి ముగింపు పలుకుతుందని కేంద్ర అమిత్ షా అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో నిర్మించనున్న దేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ ఈ రంగంలో బంధుప్రీతికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. ఇక పై శిక్షణ పొందిన వారికి మాత్రమే ఈ సెక్టార్‌లో ఉపాధి లభిస్తుందని నొక్కి చెప్పారు. తద్వారా అశ్రిత పక్షపాతం అంతమవుతుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నిర్మించనున్న దేశంలోనే తొలి త్రిభువన్ కో ఆపరేటివ్ విశ్వవిద్యాలయానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం నంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో ప్రసంగించారు. గతంలో సహకారం రంగం అభివృద్ధి కోసం శిక్షణ ఇవ్వడానికి సరైన వ్యవస్థ లేదని తెలిపారు. సంఘంలో చేరిన తర్వాత ఎంప్లాయీస్‌కు ట్రెయినింగ్ ఇచ్చేవారని, కానీ ప్రస్తుత యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత శిక్షణ పొందిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
భారతదేశ కోఆపరేటివ్ సెక్టార్‌లో ప్రతిభకు కొరత లేదని, కానీ దేశానికి శిక్షణ పొందిన వ్యక్తులు, నిపుణులు అవసరమని అభిప్రాయపడ్డారు. త్రిభువన్ యూనివర్సిటీ ఆ లోటును పూడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో యువత సాంకేతిక నైపుణ్యం, అకౌంటింగ్, శాస్త్రీయ విధానం, మార్కెటింగ్ సహా అన్ని లక్షణాలను నేర్చుకుంటారని, సహకార రంగంలోని అనేక సమస్యలను ఈ యూనివర్సిటీ పరిష్కరిస్తుందని తెలిపారు.






