ప్రధాని మోడీకి సీఎం కీలక రిక్వెస్ట్

by Muthe.Rajitha |

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)కి ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసారు.

ప్రధాని మోడీకి సీఎం కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)కి ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసారు. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన 37 ఏళ్ల నర్సు నిమిష ప్రియ(Nimisha Priya Case) విడుదల కోసం అత్యవసర జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. నిమిష ప్రియ 2017లో యెమెన్‌లో తన వ్యాపార భాగస్వామి అయిన యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడి 2018లో ఉరిశిక్ష విధించబడింది. ఈ తీర్పును 2023 నవంబర్‌లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ధృవీకరించగా.. ఈనెల 16న శిక్ష అమలు కానుంది.

పినరయి విజయన్ తన లేఖలో ఈ కేసును “క్షమాభిక్ష అర్హమైనది”గా అభివర్ణించి, యెమెన్ అధికారులతో చర్చలు జరిపి నిమిష ప్రియప్రాణాల కోసం చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు. ఆయన గతంలో మార్చి 24, 2025న కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు రాసిన లేఖను కూడా జతచేశారు. నిమిష ప్రియ తల్లి ఆమె జీవన రక్షణ కోసం చేస్తున్న విజ్ఞప్తులను కూడా పినరయి ప్రస్తావించారు.

నిమిషా 2008లో ఉద్యోగఅవకాశాల కోసం యెమెన్‌కు వెళ్లి, 2011లో తోమీ థామస్‌ను వివాహం చేసుకుని, సనా నగరంలో స్థిరపడ్డారు. యెమెన్ చట్టం ప్రకారం విదేశీయులు స్థానిక భాగస్వామి లేకుండా వ్యాపారం నిర్వహించలేరు కాబట్టి, 2015లో స్థానికుడైన తలాల్ అబ్దో మెహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. అనంతరం తలాల్ ఆమె పాస్‌పోర్టు లాక్కొని, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించగా.. ఎలాగైనా పాస్‌పోర్టు తిరిగి తీసుకునేందుకు అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అది ఓవర్‌డోస్‌ కావడం వల్ల అతడు మరణించాడు. దీంతో భయపడిన నిమిషా, ఒక యెమెనీ సహాయకురాలితో కలిసి శవాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంకులో పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో యెమెన్ కోర్టు 2020లో ఆమెకు మరణశిక్ష విధించగా.. 2023లో అక్కడి సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ షరియా చట్టం కింద "బ్లడ్ మనీ"(దియా) చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు రూ. 8.5 కోట్లు తలాల్ కుటుంబానికి ఇచ్చేందుకు ప్రతిపాదించినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం దౌత్యపరమైన సహాయం అందిస్తున్నప్పటికీ.. యెమెన్ చట్టాల ప్రకారం ఈనెల 16న ఉరిశిక్ష అమలు కానుంది


Next Story