- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా మాంజా వాడకం హత్యతో సమానం.. అధికారులకు సీఎం యోగి కీలక ఆదేశాలు
చైనా మాంజా వాడకం మనిషిని హత్య చేయడంతో సమానం అని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అన్నారు. చైనీస్ మాంజాను పూర్తిగా నిషేధించేమని అయినప్పటికీ అది అందుబాటులో ఉండడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: చైనా మాంజా వాడకం మనిషిని హత్య చేయడంతో సమానం అని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ అన్నారు. చైనీస్ మాంజాను పూర్తిగా నిషేధించేమని అయినప్పటికీ అది అందుబాటులో ఉండడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ప్రజా భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. చైనీస్ మాంజా సరఫరా చైన్ ను విచ్చిన్నం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మాంజాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
మాంజా అమ్మకాలపై మాత్రమే కాకుండా దాని నిల్వ మరియు రవాణాపై కూడా ఇంటెన్సివ్ దాడులు ప్రారంభించాలని అన్ని జిల్లాల పోలీస్ విభాగాలను ఆదేశించారు. దీని పురోగతిపై తాను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని హెచ్చరించారు. చైనా మాంజా కారణంగా ఎవరైనా మరణిస్తే అది హత్య చేయడం కంటే ఏమీ తక్కువ కాదని చెప్పారు. ఇటీవల యూపీలోని లక్నోలో ఓ బైకర్ చైనీస్ మాంజా మెడుకు తెగి తీవ్రగాయాలపై మరణించాడు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో మాంజా కారణంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.






