- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cm yogi: వారికి సనాతన ధర్మంపై గౌరవం లేదు.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి సనాతన ధర్మంపై గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి సనాతన ధర్మంపై గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithyanath) విమర్శించారు. రాముడు, కృష్ణుడిపై విశ్వాసం లేకపోవడం సోషలిజం మార్గదర్శకుడు రామ్ మనోహర్ లోహియాను ధిక్కరించడంతో సమానమని మండిపడ్డారు. యూపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సంద్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎస్పీ పాలనలో ముఖ్యమంత్రికి కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించడానికి సమయం లేదని, సనాతన ధర్మాన్ని పాటించని వ్యక్తిని కుంభమేళాకు ఇన్‌చార్జిగా చేశారన్నారు. ‘మేము మీలాగా విశ్వాసంతో ఆడుకోలేదు. మీ కాలంలో సీఎంకు ఆ కార్యక్రమాన్ని చూడటానికి, సమీక్షించడానికి సమయం లేదు, అందువల్ల ఆయన సనాతనికి చెందని వ్యక్తిని కుంభమేళా ఇన్‌చార్జ్‌గా నియమించారు’ అని అన్నారు. కానీ ప్రస్తుతం సీఎంగా నిరంతరం కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. అందుకే సందర్శకులు భారీగా తరలివస్తున్నారన్నారు.
2013లో కుంభమేళాకు వెళ్ళిన వారందరికీ గందరగోళం, అవినీతి, కాలుష్యం మాత్రమే కనిపించాయని ఆరోపించారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి నీరు సరిపోలేదని, స్నానం చేయడానికి నిరాకరించిన మారిషస్ ప్రధానమంత్రి దీనికి ఉదాహరణ అని నొక్కి చెప్పారు. ఈసారి ప్రజలు నిరంతరం మహా కుంభమేళాను సందర్శిస్తున్నారన్నారు. గత 45 రోజులుగా వామపక్షవాదులు, సోషలిస్టులు మహా కుంభమేళాపై సోషల్ మీడియాలో విషపూరిత ప్రకటనలు చేశారని ఫైర్ అయ్యారు. హజ్ యాత్ర సమయంలో పరిస్థితుల కారణంగా వందలాది మంది మరణిస్తారని, మహా కుంభమేళాపై మాట్లాడుతున్న దేశంలోని వామపక్షవాదులు దానిపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.






